ఢీకొట్టిన బైకర్.. జడ్జి మృతి (VIDEO)

85చూసినవారు
తమిళనాడు నీలగిరి జిల్లాలో మంగళవారం విషాద ఘటన జరిగింది. జిల్లా మూడో అదనపు జడ్జి కరుణానిధి (58) పొల్లాచ్చి-ఉడుమలైపేట్ రోడ్డును దాటేందుకు యత్నించారు. ఆ సమయంలో ఓ బైకర్ వేగంగా దూసుకొచ్చాడు. రోడ్డు దాటుతున్న జడ్జిని బైకర్ ఢీకొట్టాడు. అనంతరం అక్కడి నుంచి బైకర్ పరారయ్యాడు. అయితే తీవ్రంగా గాయపడిన జడ్జి కరుణానిధి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్