ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు దమ్ముంటే అదానీ వ్యవహారంపై దర్యాప్తు చేయించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సవాల్ విసిరారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అదానీ ఒప్పందం వల్లే ఏపీ ప్రజలపై విద్యుత్ భారం పెరిగిందని మండిపడ్డారు. ఈ వ్యవహారం వల్లే ఏపీతో పాటు దేశం పరువు కూడా పోతోందని దుయ్యబట్టారు. గత వైసీపీ ప్రభుత్వం అదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని ఛాలెంజ్ చేశారు.