కాళేశ్వరం డిజైన్‌లో ఎన్నో లోపాలు ఉన్నాయి: తుమ్మల

68చూసినవారు
కాళేశ్వరం డిజైన్‌లో ఎన్నో లోపాలు ఉన్నాయి: తుమ్మల
కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌లో ఎన్నో లోపాలు ఉన్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రాజెక్టుల డిజైన్‌లో లోపాలు ఉన్నాయని ఆనాడే చెప్పానని.. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైంది మేడిగడ్డ బ్యారేజీ అని అన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో నీరు నిలుస్తేనే.. ఎక్కడికైనా ఎత్తిపోసే అవకాశం ఉంటుందని చెప్పారు. మేడిగడ్డలో నీరు ఉండని పరిస్థితి ఏర్పడిందని.. మిగతా జలాశయాలకు నీటిని ఎలా ఎత్తిపోస్తారు? అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్