అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున అభ్యర్థిగా బరిలో ఉన్న కమలా హారిస్.. తన రన్నింగ్‌మేట్, మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాజ్‌తో కలిసి తొలి ర్యాలీ నిర్వహించారు. ఫిలడెల్పియాలో నిర్వహించిన ఈ ర్యాలీలో డెమోక్రటిక్ పార్టీ మద్దతుదారులు భారీగా తరలివచ్చారు. టిమ్ వాజ్‌ను రన్నింగ్‌మేట్‌గా ప్రకటించిన తర్వాత వారికి 10 మిలియన్ డాలర్ల విరాళాలు వచ్చాయి.