మాక్లూర్ మండలంలో టాస్క్ ఫోర్స్ సిఐ పురుషోత్తం బుధవారం మరో పేకాట స్థావరంపై దాడి చేశారు. గుత్ప శివారులో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో అక్కడికి చేరుకుని పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ 4 వేల నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.