కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం ఏరియా ఆస్పత్రిలో మహమ్మద్ ప్రవక్త పుట్టిన నెల సందర్భంగా ఆదివారం రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. హ్యుమినిటీ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మౌలానా రిజ్వాన్ మాట్లాడుతూ, ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరేళ్లుగా ఏరియా ఆసుపత్రిలో రక్తదానం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హ్యుమినిటీ వెల్ఫేర్ ఫౌండేషన్ అధ్యక్షుడు షకీల్, అక్బర్, యువకులు పాల్గొన్నారు.