రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామంలో బాల్యవివాహాలను అరికడతామని, బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాల్ని అందరికీ తెలియజేస్తామని ఆరోగ్య కార్యకర్త భువనేశ్వరి ఆధ్వర్యంలో మహిళలతో ప్రతిజ్ఞ చేయించారు. రెడ్డి పేట ఆరోగ్య ఉప కేంద్రం ఆవరణలో గురువారం బాల్య వివాహాల నిర్మూలన పై ప్రతిజ్ఞ చేపట్టారు. చట్టఉల్లంఘనకు వచ్చే శిక్షల గురించి తెలిపి, గ్రామంలో బాల్యవివాహాలు జరగకుండా చూస్తామని పేర్కొన్నారు.