రుద్రూర్, కోటగిరి, పోతంగల్, వర్ని ప్రాంతాల్లో భారీ వృక్షాలను నరుకుతూ సొమ్ము చేసుకుంటున్నారు. అటవీ భూములు, రైతుల పంట పొలాల వద్ద వృక్షాలు అక్రమ కలప వ్యాపారుల చేతుల్లో చిత్తవుతున్నాయి. చెట్లను కొట్టాలంటే అటవీ అధికారుల అనుమతులు తప్పనిసరి. ఇవేమీ లేకుండా ఉదయం చెట్లను కొట్టి ఓ మూలన దుంగలను ఉంచి రాత్రివేళలో గుట్టుగా తరలిస్తున్నారని మంగళవారం స్థానికులు తెలిపారు. అధికారులు దీనిపై దృష్టి పెట్టాలన్నారు.