బాన్సువాడ టీచర్స్ కాలనీలో బుధవారం ఆడపడుచులు ముగ్గులు వేసి సంక్రాంతి సంబరాలను సంబరంగా జరుపుకున్నారు. ముగ్గులు వేసిన తర్వాత సెల్ఫీ తీసుకొని ముచ్చట పడ్డారు. బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. పిండివంటలతో పసందైన విందును ఆరగించారు. పిల్లలు, పెద్దలు పతంగులు ఎగరవేసి సంబరపడ్డారు.