బాన్సువాడ మున్సిపల్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి , షాదీ ముబారక్ చెక్కులను మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, కామారెడ్డి జిల్లా రైతు బంధు అధ్యక్షులు అంజిరెడ్డి, తెరాస నాయకులు శనివారం రోజున పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బాన్సువాడ అభివృద్ధి ప్రదాత పొచారం శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు 18 షాది ముబారక్, 2 కళ్యాణ లక్ష్మీ చెక్కులను అందచేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఎజాస్, పట్టణ మైనారిటీ ప్రధాన కార్యదర్శి యండి. దావూద్, షాదీఖానా చైర్మన్ వాహబ్, ఆర్. ఐ. అశోక్, మున్సిపల్ కౌన్సిలర్లు శ్రీనివాస్, అహ్మద్, నార్ల నందకిశోర్, ఆమెర్, హకీం, మోతిలాల్, నాయకులు రమేష్, ముజ్జు తదితరులు పాల్గొన్నారు.