కామారెడ్డి పట్టణంలో సావిత్రిబాయి పూలే జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఈఓ రాజు మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి కోసం, విద్యా హక్కుల కోసం కృషి చేసిన మహనీయురాలన్నారు. ఉపాధ్యాయులు ఆమెను ఆదర్శంగా తీసుకొని, ఆమె అడుగు జాడలో నడవలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యాల సంతోష్ పాల్గొన్నారు.