కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండల పరిధిలో నెమ్లి సాయిబాబా ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాబా వారికి ఉదయం నుంచి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, కాకడ హారతి, అష్టోత్తర, కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.