రుద్రూర్ మండలం బీజేపీ నాయకులు భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని బుధవారం నిర్వహించారు. ఏకాత్మ మానవవాదం ప్రవచించి సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తికే ప్రభుత్వ పథకాల్లో తొలి ప్రయోజనం చేకూరాలన్న అంత్యోదయ విధానాన్ని రూపొందించిన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ మండలం బిజెపి అధ్యక్షుడు ఆలపాటి హరికృష్ణ పాల్గొన్నారు.