బాన్సువాడ ప్రజలకు టిఎస్ ఆర్టిసి శుభవార్త

784చూసినవారు
బాన్సువాడ ప్రజలకు టిఎస్ ఆర్టిసి శుభవార్త
బాన్సువాడ ప్రజలకు టిఎస్ ఆర్టిసి డిపో మేనేజర్ శుభవార్త చెప్పారు. బాన్సువాడ పట్టణంలోని బస్ డిపోలో డిపో మేనేజర్ సదాశివ్ మాట్లాడుతూ ఈరోజు నుండి జూన్ 31వ తేదీ వరకు పెండ్లిలకు, శుభకార్యములకు, తీర్థయాత్రలకు వెళ్లే భక్తులకు 10 శాతం డిస్కౌంట్ తో ఎటువంటి డిపాజిట్ లేకుండా బాన్సువాడ ఆర్టీసీ డిపో తరపున బస్సులను అద్దెకు ఇవ్వబడును అని తెలిపారు. బస్సులు బుక్ చేసుకొనుటకు బాన్సువాడ డిపో ఫోన్ నెంబర్లు 9963720146. 7382843670 కు సంప్రదించాలని తెలియజేశారు. తక్కువ అద్దెతో సురక్షితమైన, సుఖవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నాము కావున ఇట్టి అవకాశాన్ని బాన్సువాడ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా బాన్సువాడ డిపో మేనేజర్ సదాశివ్ వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్