వర్ని మండలంలోని హుమ్నాపూర్, పాతవర్ని గ్రామాల్లో ఆటోలో తిరిగుతూ ప్రజల నుంచి రేషన్ బియ్యం కొనుగోలు చేస్తున్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తే పీడీ యాక్టు ఉన్నప్పటికీ స్మగ్లర్లు మాత్రం దందా కొనసాగిస్తూనే ఉన్నారు. పీడీ యాక్టు నమోదు చేస్తే జైలు నుంచి బయటపడే అవకాశం లేకపోయినప్పటికీ దందా మాత్రం ఆపడం లేదు. పేదలకు చెందవలసిన బియ్యం పక్కదారి పట్టిస్తూ బియ్యం స్మగ్లర్లు లక్షలు గడిస్తున్నారు.