రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

12526చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
ఎడపల్లి ఎమ్మెస్సీ ఫారం గ్రామంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కోటగిరి మండలం ఎత్తోండ గ్రామానికి చెందిన సోన్ కాంబ్లె కేశవ్(31)కు తీవ్ర గాయాలయ్యాయి. కేశవ్ నిజామాబాద్ నుండి స్వగ్రామానికి బైక్ పై వెళ్తుండగా ఎమ్మెస్సీ ఫారం వద్ద బైక్ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొంది. ఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్