తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య వర్ధంతి ఆదివారం సాలూరా మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కిష్టయ్య తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన గొప్ప వీరుడు అని, ఆయన సేవలు చిరకాలం గుర్తించబడతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.