Jan 22, 2025, 17:01 IST/ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి: అర్హులకు రేషన్ కార్డులు అందడంలేదని గ్రామస్తుల ఆగ్రహం
Jan 22, 2025, 17:01 IST
అర్హులకు రేషన్ కార్డులు అందడంలేదని నాగిరెడ్డిపేట్ మండలం తాండూర్ గ్రామంలో జరిగిన గ్రామ సభలో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాండూర్, నాగిరెడ్డిపేట్ బెజుగం చెరువు తండా జీపీలో బుధవారం జీపీ ప్రత్యేక అధికారుల అధ్యక్షతన ప్రజాపాలన గ్రామసభలు జరిగాయి. నాగిరెడ్డిపేటలో పంచాయతీ కార్యదర్శి కార్తీక్ లబ్ధిదారుల జాబితాను గ్రామ సభలో చదివి వినిపించారు. జాబితా చదువుతుంటే గ్రామస్థులు ఆగ్రహించారు.