తెలంగాణకు జేఎస్‌డబ్ల్యూ రూ.800 కోట్ల పెట్టుబడులు

54చూసినవారు
తెలంగాణకు జేఎస్‌డబ్ల్యూ రూ.800 కోట్ల పెట్టుబడులు
TG: రాష్ట్రంలో మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ స్థాపించనున్నట్లు జేఎస్‌డబ్ల్యూ సంస్థ ప్రకటించింది. అమెరికాకు చెందిన డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ అనుబంధంతో ఈ యూనిట్ నెలకొల్పనుంది. దాదాపు రూ.800 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీనికి సంబంధించి దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో జేఎస్‌డబ్ల్యూ డిఫెన్స్‌ అనుబంధ సంస్థ అయిన జేఎస్‌డబ్ల్యూ యూఏవీ లిమిటెడ్‌ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్