గుజరాత్‌లోని వడోదరలోని విషాద ఘటన జరిగింది. నర్మదా కాలువపై ఒక వ్యక్తి తన పెంపుడు కుక్కతో నడుస్తూ వెళుతుండగా ఆ కుక్క కాలువలో పడిపోయింది. ఈ క్రమంలో కుక్కను కాపాడటానికి యజమాని కాలువలోకి దూకాడు. కుక్క బతికి బయటపడింది. కానీ దాని కాపాడటానికి వెళ్లిన 51 ఏళ్ల యజమాని నీటిలో మునిగి చనిపోయాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు రెస్క్యూ చేపట్టి మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.