జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ శుక్రవారం గౌరారం గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు హనుమంతరావు పటేల్ ను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. మరియు కోమటి చెరువు తండా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నునావత్ హరిచంద్ రెండు రోజుల క్రితం మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.