కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.