మద్నూర్ మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణ పనులను ప్రారంభించడానికి ఈ నెల 5వ తేదీన(గురువారం)శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు వస్తున్నారని జుక్కల్ ఎమ్మెల్యే అన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతంచేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.