రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే జుక్కల్ మండల కేంద్రంలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా సర్వే ను బాన్సువాడ ఆర్డీఓ కిరణ్మయి మంగళవారం పరిశీలించారు. సర్వే వల్ల వస్తున్న సమస్యలు, ప్రజల స్పందన ను సర్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఈ సర్వే లో పాల్గొనాలని కోరారు.