జుక్కల్ మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ మరుగు దొడ్లు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఎంపీ నిధులతో ఐదు లక్షలతో శాంక్షన్ అయింది. దాదాపు పది సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు మరుగుదొడ్లు పూర్తయిన దాఖలాలు లేవు. మరుగుదొడ్లు త్వరగా పూర్తీ చేయాలని గురువారం ప్రయాణీకులు కోరుతున్నారు.