జుక్కల్ మండల్ లాడేగావ్ గ్రామంలో ఉన్న ట్రాక్టర్ యజమానులు అందరూ కలిసి శుక్రవారం తన గ్రామ చెరువుకు వెళ్లే రహదారికి మొరం వేసుకొని రహదారిని బాగు చేసుకున్నారు. దాదాపు ఒక్క కిలోమీటర్ గల రహదారికి మరమ్మత్తులు నిర్వహించారు. ఏ రాజకీయ నాయకుడి సహాయ సహకారాలు లేకుండా ట్రాక్టర్ యజమానులే రహదారిని బాగు చేయడం పట్ల గ్రామ ప్రజలందరూ ట్రాక్టర్ యజమానులకు ప్రశంసలు వ్యక్తపరిచారు.