కామారెడ్డి: నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్ల మూసివేత
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి శనివారం ఎగువ ప్రాంతాల నుండి 3, 200 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు అధికారులు శనివారం తెలిపారు. ప్రాజెక్టు ప్రధాన గేట్లను మూసివేసామని తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405. 00 అడుగులు కాగా ప్రస్తుతం 1404. 92 అడుగులతో, 17. 802 టీఎంసీలకు గాను ప్రస్తుతం 17. 687 టీఎంసీలతో జలాశయం నిండు కుండల ఉందని అన్నారు.