బిచ్కుందలో ముస్లింల భారీ ర్యాలీ

58చూసినవారు
మహమ్మద్ ప్రవక్తపై యతి నర్సింగ్ ఆనంద్ వ్యాఖ్యలకు నిరసనగా ముస్లింలు శనివారం బిచ్కుందలో శాంతియుతంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ముస్లిం యువకులు, ప్రజలు మాట్లాడుతూ, అన్ని మతాల వారు సమానంగా మన దేశంలో జీవిస్తారని, లౌకికదేశంలో అన్నదమ్ముల కలిసి ఉంటామన్నారు. ఏ మతానికి కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదన్నారు. భాషాసెట్, కలీం పటేల్, బాబా, గౌస్ సెట్, అన్వర్ సెట్ ముస్లింలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్