బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి జిల్లా కేంద్రంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం నుండి జయప్రకాష్ నారాయణ విగ్రహం వరకు వ్యాపార సముదాయాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, 10వ వార్డు ఇంచార్జ్ కాసర్ల రవీందర్ పాల్గొని పలువురికి సభ్యత్వం చేయించారు. ఎమ్మెల్యే కెవిఆర్, మాజీ ఎంపీ బీబీ పాటిల్ పాల్గొన్నారు.