నాగిరెడ్డిపేట: కొలువులో చేరిన కొద్ది రోజులకే ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
ప్రభుత్వ కొలువులో చేరిన కొద్ది రోజులకే ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన నాగిరెడ్డిపేట మండలం మాసానిపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వరిగే నర్సింలు కుమారుడు యాదగిరికి రెండు ఉద్యోగాలు రాగ, లింగంపేట్ బాలుర ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయునిగా విధుల్లో చేరాడు. ఫుడ్ పాయిజన్ కావడంతో మంగళవారం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.