ఏపీకి మరో ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా రూపాంతరం చెందనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో, బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, నెల్లూరు, తిరుపతి, గురువారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, ప్రకాశం, నెల్లూరు, వెఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.