నాగిరెడ్డిపేట మండలం తాండూర్ గ్రామానికి చెందిన జక్కుల రాములు మంగళవారం గోపాల్ పేట్ లోని బ్యాంక్లో రూ. 85వేలు డ్రా చేసుకుని ఆటోలో తాండూర్కు వచ్చాడు. ఆటో దిగి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా ఆయన చేతిలోని బ్యాగ్ను వెనుక నుంచి బైక్పై వచ్చిన దుండగుడు దొంగలించాడు. నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.