కోటగిరి మండల కేంద్రానికి చెందిన సాయిబాబా(35) తన కుటుంబ సభ్యులు, స్నేహితుడితో కలిసి బుధవారం మాఘమాస పౌర్ణమి సందర్భంగా రెంజల్ మండలం కందకుర్తి గోదావరిలో స్నానానికి వెళ్ళాడు. స్నేహితుడితో కలిసి పుష్కర్ ఘాట్ వద్ద స్నానానికి దిగి ప్రమాదవశాత్తు నీటిలో మునిగాడు.జాలర్లతో వెతికించిన సాయిబాబా దొరకలేదు. గల్లంతైన వ్యక్తి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.