

శివలింగాన్ని చుట్టేసిన నాగపాము (వీడియో)
AP: విశాఖలోని చంద్రబాబు నాయుడు కాలనీలో బుధవారం అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. సత్యనారాయణ స్వామి గుడికి వెళ్లే మార్గంలోని శివాలయంలోకి నాగుపాము ప్రవేశించింది. గుడిలో అటు ఇటు తిరిగి శివలింగాన్ని ఆభరణంలా చుట్టేసింది. చాలా సేపటి వరకు శివలింగం దగ్గర పడగవిప్పి దర్శనమిచ్చింది. మాఘ పౌర్ణమి రోజు శివలింగంపై నాగుపాము శివుని చెంతకు రావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.