ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక సర్వే ప్రక్రియలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ఎన్యుమరేటర్లు పకడ్బందీగా నిర్వహించాలని ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్నె ప్రభాకర్ అన్నారు. మంగళవారం జడ్పి ఉన్నత పాఠశాలలో కులగణన సర్వే విషయమై మండల, మున్సిపల్ ఎన్యూమరేటర్లకు శిక్షణ నిర్వహించారు. ఈ నెల 6 నుండి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొనబోయే ఎన్యుమరేటర్లు కులగణన పక్కగా నిర్వహించాలన్నారు.