నిమజ్జన ర్యాలీలో డిజెలకు అనుమతి లేదు: ఎస్ఐ

79చూసినవారు
నిమజ్జన ర్యాలీలో డిజెలకు అనుమతి లేదు: ఎస్ఐ
ఎల్లారెడ్డితో పాటు మండలంలోని గ్రామాల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు పోలీసుల అనుమతి తీసుకోవాలని ఎల్లారెడ్డి ఎస్ఐ బొజ్జ మహేష్ తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ. వినాయక మండపాల నిర్వాహకులు పూర్తి వివరాలతో పోలీస్ స్టేషన్ లో ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. డీజే నిర్వాహకులకు కౌన్సిలింగ్ నిర్వహించి ముందస్తుగా తహసిల్దార్ ఎదుట బైండోవర్ చేశమని, నిమజ్జనం ర్యాలీలలో డిజేలకు అనుమతి లేదన్నారు.

సంబంధిత పోస్ట్