ఎల్లారెడ్డి సాయిశివ ఆలయంలో ఆదివారం గురుపౌర్ణమి వేడుకలు భక్తులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఆలయంలో శ్రీ షిర్డీ సాయిబాబా సంస్థాన సభ్యులు సాయి ప్రకాష్ దేశ్ పాండే, ఆలయ ప్రతినిధి ముత్యపు వీరేశలింగం గుప్తా, ఆలయ పూజారి విజయ్ కుమార్ కలిసి బాబా దివ్యమంగళ విగ్రహానికి కాకడ హారతి ఇచ్చి 6 పంచామృత మంగళ స్నానం చేశారు. సామూహిక సత్యనారాయణ వ్రతాలు పూజారి వైభవ్ కుమార్ శర్మలు శాస్త్రోక్తంగా జరిపించారు.