సదాశివనగర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్, తాసిల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, మార్కెట్ కమిటీ, స్త్రీ శక్తి భవనం, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు పంచుతూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేసిన నృత్యాలు అందరిని అలరించాయి.