కామారెడ్డి డీటీఓ కార్యాలయంలో జరుగుతున్న అక్రమ వసూళ్లపై అసిస్టెంట్ డైరెక్టర్ ట్రెజరీ వెంకటేశ్వర్లు కి టీపీటీఎఫ్ జిల్లా శాఖ పక్షాన బుధవారం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఉద్యోగ విరమణ ఉద్యోగుల నుండి పెన్షన్ ప్రపోజల్స్ పంపడం కోసం డబ్బులు డిమాండ్ చేయడం జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తుంది. 2024 డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయుల ట్రెజరీ ఐడి కేటాయించడానికి కూడా డబ్బులు డిమాండ్ చేయడం శోచనీయం.