రాజకీయాలు పక్కనపెట్టి మాజీ ఎమ్యెల్యే పరామర్శలకు బుధవారం వెళ్లారు. ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గ్రామ మాజీ సర్పంచ్ అలీపాష సతీమణి, తల్లి ఇద్దరు ఇటీవలే అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ బీఆర్ఎస్ ఎమ్యెల్యే జాజాల సురేందర్ అలీల్ పాషా ఇంటికి వెళ్లి పరామర్శించారు. అలీల్ పాషా తమ్ముడు హఫీజ్ పటేల్ కాంగ్రెస్ పార్టీ సుభాష్ రెడ్డి వర్గీయుడు కాగా, పార్టీలకు అతీతంగా వెళ్లి మాజీ ఎమ్యెల్యే పరామర్శించారు.