జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శిగా మంజుల

260చూసినవారు
జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శిగా మంజుల
కామారెడ్డి జిల్లాజాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శిగా మంజులను నియమించినట్లు జిల్లా అధ్యక్షులు కాముని సుదర్శన్ శనివారం తెలిపారు. బీసీల సామాజిక ఎదుగుదలకు మహిళా సాధికారతకు కృషి చేయాలని ఆమెకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ యూత్ జిల్లా అధ్యక్షులు రాజీవ్ కుమార్, యూత్ ప్రధాన కార్యదర్శి అఖిల్ రావు, యూత్ నాయకులు నిఖిల్ , ఇర్ఫాన్, గంగాధర్, మాల మహానాడు రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి నాగమణి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్