సదాశివనగర్: టెంపుల్ కు కరెంటు కట్ ను నిరసిస్తూ స్వాముల ధర్నా

73చూసినవారు
సదాశివనగర్ మండల కేంద్రంలోని అయ్యప్ప టెంపుల్ కు కరెంటు నిలిపివేతను నిరసిస్తూ.. సోమవారం అర్ధరాత్రి అయ్యప్ప మాలధారణ స్వాములు 144 జాతీయ రహదారిపై ధర్నా చేశారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పిఏ చెప్పడంతోనే కరెంటు నిలిపివేసినట్లు ట్రాన్స్ కో అధికారులు వెల్లడించారని, ఇది సరైన పద్ధతి కాదని స్వాములు మండిపడ్డారు. సుమారు అరగంట పాటు ధర్నాతో పోలీసులు సముదాయించడంతో అయ్యప్ప స్వాములు ధర్నాను విరమించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్