బీజేపీ సభ్యత్వ నమోదులో జిల్లా మొదటి స్థానంలో రావాలి

83చూసినవారు
బీజేపీ సభ్యత్వ నమోదులో జిల్లా మొదటి స్థానంలో రావాలి
కామారెడ్డి జిల్లాలో బీజేపీ సభ్యత్వ నమోదులో మొదటి స్థానంలో నిలవాలని, ప్రతి నాయకుడు సభ్యత్వ నమోదు చురుకుగా చేయించాలని కామారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అరుణ తార అన్నారు. బుధవారం ఎల్లారెడ్డిలో ఆమె సభ్యత్వ నమోదు ప్రారంభించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించే దిశగా పార్టీ నేతలు కృషి చేయాలన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి, మర్రి బాలకిషన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్