ఎల్లారెడ్డి మండలం ఆజామాబాద్ లోఎమ్యెల్యే మదన్ మోహన్ కృషితో ఎన్ఆర్ఈజిఎస్ నిధుల కింద 5లక్షల సీసీ రోడ్డు మంజూరైంది. శుక్రవారం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోడ్డు పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుర్మ సాయిబాబా, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఏఎంసి చైర్మన్ వెంకటరామిరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ గంగారెడ్డి, మాజీ జెడ్పిటిసి సామెల్ పాల్గొన్నారు.