ఎల్లారెడ్డి పట్టణమునందు వివేకానంద 162 వ జయంతి సందర్భంగా యూత్ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా జయంతిని నిర్వహించడం జరిగింది. స్వామి వివేకానంద సూక్తి తెలియజేస్తూ జీవితంలో ధనాన్ని కోల్పోయినా పరవాలేదు కానీ మీ క్యారెక్టర్ని కోల్పోతే అంతా కోల్పోయినట్లే అని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షులు మార్లు సాయి బాబు తదితరులు పాల్గొన్నారు.