హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ ఇవాళ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హిమాచల్‌లో మోదీ వేవ్ ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రజాస్వామ్య ఉత్సవంలో ప్రజలు అందరూ పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ప్రధాని మోదీ సుమారు రెండు వందల ర్యాలీలు నిర్వహించారని, రెండు నెలల్లోనే 90 ఇంటర్వ్యూలు ఇచ్చినట్లు ఆమె చెప్పారు.