పుణె ప్రధాన కేంద్రంగా గల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 600 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 24వ తేదీలోగా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోని బ్యాంకు శాఖల్లో 11, తెలంగాణలోని బ్యాంకు శాఖల్లో 16 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. వెబ్‌సైట్: bankofmaharashtra.in