ఎంపీ కంగన్ రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచారు. మార్ఫింగ్ చేసిన లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఫోటోను ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేయడంతో కంగనా విపరీతంగా ట్రోల్ అవుతోంది. ఈ ఫోటోలో రాహుల్ సాధారణంగా ముస్లింలు ధరించే టోపీని పెట్టుకొని, నుదుటిపై చందనం, తిలకం ధరించారు. అలాగే మెడలో శిలువ కూడా ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌కి “కులం అడగకుండానే కుల గణన చేయాల్సిన జాతి జీవి” అని క్యాప్షన్ లో ఆమె రాశారు.