కారును ధ్వంసం చేసిన కన్వారియాలు(వీడియో)

81చూసినవారు
కన్వర్‌తో తిరిగి వస్తున్న కన్వారియాలు ఓ కారును ధ్వంసం చేశారు. ఈ ఘటన యుపిలోని ముజఫర్‌నగర్‌లోని పుర్కాజి సమీపంలో జరిగింది. హరిద్వార్ నుండి కన్వర్‌తో తిరిగి వస్తున్న కన్వారియాలను స్వల్పంగా ఓ కారు ఢీకొట్టడంతో వారు కారును ధ్వంసం చేశారు. కారులో ఉన్న వ్యక్తిని సమీప దాబా లోపల దారుణంగా కొట్టారు. పోలీసులు వచ్చి శివభక్తులకు నచ్చజెప్పడంతో గొడవ సద్దుమనిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్