ఉక్రెయిన్ కు చేరుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 10 గంటల పాటు రైలులో ప్రయాణించనున్నట్లు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ మీడియా కథనాలు తెలిపాయి. వాటి ప్రకారం, పోలాండ్ లో సమావేశాలు ముగించుకుని ఆగస్టు 22న ప్రధాని మోదీ ఉక్రెయిన్ కు బయలుదేరే అవకాశం ఉంది. ఆగస్టు 23న ఉదయం మోదీ ఉక్రెయిన్ కు చేరుకుని దాదాపు ఏడు గంటలపాటు ఆ దేశంలో గడపనున్నారు. ఆ తర్వాత మళ్లీ రైలులోనే ఆయన పోలాండ్ కు తిరిగి వెళ్తారు.